Sat Dec 21 2024 06:27:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జోడో యాత్రలో సోనియా
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. ఈరోజు యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. ఈరోజు యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. జక్కనహళ్లి క్రాస్ రోడ్డు వద్ద సోనియా పాల్గొన్నారు. మూడు రోజుల క్రితమే సోనియా గాంధీ మైసూరు చేరుకున్నారు. కూర్గ్ లో విశ్రాంతి తీసుకున్నారు. నిన్న విజయదశమి రోజున సోనియా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గత నెల 7వ తేదీ తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే.
నెల రోజుల నుంచి...
నెల రోజుల నుంచి రాహుల్ జోడోయాత్రలో పాల్గొంటున్నారు. 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో జోడో యాత్ర పూర్తయింది. రాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాహుల్ ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు, రేపు జరిగే యాత్రలో సోనియా గాంధీ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మైసూరు జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరుగుతుంది.
Next Story