Sat Dec 21 2024 06:12:41 GMT+0000 (Coordinated Universal Time)
900 కి.మీ దాటిన రాహుల్ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. ఈరోజు చిత్రదుర్గ జిల్లాలో రాహుల్ యాత్ర ప్రారంభమయింది.
రాహుల్ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. ఈరోజు చిత్రదుర్గ జిల్లాలో రాహుల్ యాత్ర ప్రారంభమయింది. రోజుకు 25 కిలోమీటర్ల మేర ఆయన నడక కొనసాగిస్తున్నారు. రాహుల్ వెంట పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యాత్ర కొనసాగించి భోజన విరామానికి ఆగుతారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రాత్రి ఏడు గంటల వరకూ పాదయాత్రలో రాహుల్ పాల్గొంటున్నారు.
ఈ నెల 17న...
ఇప్పటి వరకూ రాహుల్ భారత్ జోడో యాత్ర 905 కిలోమీటర్ల మేర సాగింది. రాహుల్ ను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు వచ్చి ఆయనతో కరచాలనం చేసేందుకు, ఫొటోలో దిగేందుకు పోటీ పడుతున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బందికి కూడా నిలువరించడం కష్టంగా మారింది. ఈ నెల 17వ తేదీన రాహుల్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఆరోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయనతో పాటు నేతలు కూడా పాల్గొంటారు.
Next Story