Sat Dec 21 2024 06:02:11 GMT+0000 (Coordinated Universal Time)
మైసూరులో పాదయాత్ర... పెరుగుతున్న మద్దతు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. మైసూర్ లో ప్రస్తుతం యాత్ర జరుగుతుంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది. మైసూర్ లో ప్రస్తుతం యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు భారీగా జనం తరలి వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. మైసూరులో ఉండటంతో దసరా సందర్భంగా రాహుల్ గాంధీ మైసూరులోని చాముండేశ్వర దేవాలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఒకే రోజు మసీదు, చర్చిలకు వెళ్లి ప్రార్థనలు జరిపారు.
కూర్గ్ లో బస...
మైసూరుకు నిన్న సోనియా గాంధీ వచ్చారు. ఆమెకు విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆమె కూర్గ్ లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story