Sat Dec 21 2024 00:11:44 GMT+0000 (Coordinated Universal Time)
మధ్యప్రదేశ్ లో రాహుల్ జోడో యాత్ర
మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. జోడోయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. జోడోయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. సెప్టంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. ఇప్పటి వరకూ పదిహేను వందలకు పైగా కిలోమీటర్లు నడిచారు. రెండు వేల కిలోమీటర్లకు చేరువలో యాత్ర కొనసాగుతుంది. భారత్ జోడో యాత్రకు అన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన లభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
ప్రజల నుంచి...
ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఆయన పాదయాత్రకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా వస్తుండటంతో ఉత్సాహం మరింత పెరుగుతుంది. కార్నర్ మీటింగ్ లు, బహిరంగ సభలు, మేధావులు, రైతులతో సమావేశాల ద్వారా రాహుల్ గాంధీ పార్టీని మరింత దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల వరకూ ఈ హీట్ కొనసాగుతుందా? లేదా? అన్నది చూడాలి.
Next Story