Sat Dec 21 2024 00:23:55 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారుల్లో ఆనందాన్ని నింపిన రాహుల్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ప్రతి చోట చిన్నారుల నుంచి అన్ని వర్గాల ప్రజలను రాహుల్ కలుసుకుంటున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నవంబర్ 29న ఉజ్జయినిలో పర్యటించే సమయంలో రాహుల్ పాఠశాల విద్యార్థినులను కలసుకున్నారు. వారితో ముచ్చటిస్తుండగా మీ గోల్ ఏమిటని ప్రశ్నించారు.
మరిచిపోయిన తర్వాత...
కొందరు విద్యార్థులు తాము పైలట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరికొందరు తాము హెలికాప్టర్ లో ప్రయాణించాలని ఉందని మనసులో మాటను రాహుల్ కు చెప్పేశారు. మీ కోరిక తాను నెరవేరుస్తానని రాహుల్ మాట ఇచ్చారు. ఆయన ఉజ్జయిని దాటి దాదాపు పక్షం రోజులవుతుంది. విద్యార్థులు కూడా రాహుల్ తో మాట్లాడిన విషయాన్ని మర్చిపోయారు. ఒక్కసారిగా హెలికాప్టర్ వచ్చింది. రాహుల్ తాను మాట ఇచ్చిన విద్యార్థులను హెలికాప్టర్ లో తిప్పారు. దాదాపు 30 నిమిషాలు వారు హెలికాప్టర్ లో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. రాహుల్ ఇచ్చిన మాట మరవకుండా వారి కోరిక నెరవేర్చినందుకు విద్యార్థులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.
Next Story