Mon Dec 23 2024 08:55:32 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ కు రాహుల్.. భద్రత మరింత కట్టుదిట్టం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు పంజాబ్ లోకి ప్రవేశించనుంది. దీంతో యాత్రకు పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు పంజాబ్ లోకి ప్రవేశించనుంది. దీంతో యాత్రకు పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. పంజాబ్ లో రాహుల్ యాత్ర ఎనిమిది రోజుల పాటు సాగనుంది. పంజాబ్ లో రాహుల్ పర్యటనను అడ్డుకుంటే పది లక్షల డాలర్లు నజరానాగా ఇస్తామని సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ప్రకటించడంతో భద్రతను మరింత పటిష్టం చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలతో వలయంగా ఏర్పడి పంజాబ్ లో రాహుల్ పాదయాత్రకు భద్రతను కల్పించనున్నారు.
30న ముగింపు సభ....
మరో వైపు ఈ నెల 30వ తేదీతో రాహుల్ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. సెప్టంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాల మీదుగా పంజాబ్ కు చేరుకోనుంది. ఈ నెలాఖరుకు కాశ్మీర్ కు చేరుకోనుంది. రాహుల్ పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 21 పార్టీలను ఆహ్వానించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనాలని లేఖలో ఖర్గే కోరారు.
Next Story