Sat Dec 21 2024 09:05:54 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ యాత్రకు నేడు బ్రేక్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేడు బ్రేక్ ఇచ్చారు. ఆయన నిన్న రాత్రి పాదయాత్ర ముగిసిన వెంటనే ఢిల్లీ బయలు దేరి వెళ్లారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేడు బ్రేక్ ఇచ్చారు. ఆయన నిన్న రాత్రి పాదయాత్ర ముగిసిన వెంటనే ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఒకరోజు యాత్రకు విరామమిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై చర్చించేందుకు రాహుల్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఆయన తిరిగి కేరళ చేరుకుంటారు. రేపటి నుంచి యాత్ర యధాతధంగా జరుగుతుంది.
తాను పోటీ చేయడం లేదని....
రాహుల్ గాంధీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన సీనియర్ నేతలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ను పోటీ చేయించాలని రాహుల్ భావిస్తున్నారు. అదే జరిగితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి గెహ్లాత్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీనిపై చర్చించేందుకే ప్రధానంగా రాహుల్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.
Next Story