Sat Dec 21 2024 10:40:58 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : ప్రియమిత్రుడి కోసం స్వీట్లు కొన్న రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. అయితే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఒక గిఫ్ట్ను కొనుగోలు చేశారు. ఒక మిఠాయి దుకాణంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ మైసూర్ పాక్ ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించారు. ఎందుకోసం.. ఎవరి కోసం ఈ మైసూర్ పాక్ అన్న ప్రశ్నకు మాత్రం తన స్నేహితుడు స్టాలిన్ కు అని సమాధానమిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్వీట్ షాపులోకి వెళ్లి...
తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఒక స్వీట్ దుకాణంలోకి వెళ్లి అక్కడ మైసూర్ పాక్ ను కొనుగోలు చేశారు. రాహుల్ గాంధీ తమ షాపులోకి రాగానే లోపల యజమానితో పాటు సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఫేమస్ స్వీట్ ఏంటి అని అడిగారు. వాళ్లు మైసూర్ పాక్ అనడంతో దానిని కొనుగోలు చేశారు. తన ప్రియమిత్రుడు స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనుగోలు చేశానని చెప్పాడు. తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆ మైసూర్ పాక్ ను ఇవ్వడంతో స్టాలిన్ సయితం ఆశ్చర్యపోయాడు.
Next Story