Sun Nov 17 2024 22:25:25 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : బీజేపీపై సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడూ హ్యాకింగ్ కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశఆరు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయితే ఫోన్ ట్యాపింగ్ లకు తాము భయపడేది లేదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ లు దేశంలో జరగలేదన్నారు.
అదానీ కోసమే...
కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణను చూసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలున్నాయని భావించిన బీజేపీ విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తుందన్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ లంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. నివేదికలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండటంతోనే అరాచకానికి అధికార పార్టీ దిగుతుందన్నారు.
Next Story