Wed Apr 09 2025 08:08:30 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : నాపై ఈడీ దాడులు జరిగే అవకాశముంది
తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేసే అవకాశముందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు

తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేసే అవకాశముందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ఈడీ వర్గాల్లో తనకు కొందరు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈడీ కార్యాలయంలో పనిచేస్తున్న వారే తనకు ఈ సమాచారం ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
తన ప్రసంగంపై...
పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంపై గుర్రుగా ఉన్న కొందరు ఈడీ దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. బీజేపీపై చక్రవ్యూహ విమర్శలు చేసినందుకు ఈడీతో సోదాలు చేయించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈడీ దాడుల కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. తన ప్రసంగం నచ్చని కొందరు వ్యక్తులు ఈ దాడులకు పూనుకుంటున్నారని అన్నారు. చక్రవ్యూహం తరహాలో ఆరుగురు వ్యక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.
Next Story