Mon Dec 23 2024 19:02:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జోడో యాత్రకు బ్రేక్
రాహుల్ గాంధీ జోడో యాత్రకు నేడు విరామం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో విరామం ప్రకటించారు
రాహుల్ గాంధీ జోడో యాత్రకు నేడు విరామం ప్రకటించనున్నారు. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. రాహుల్ గాంధీ బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం తొమ్మిది వేల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓటు హక్కును వినియోగించుకుంటారు.
కర్నూలులో..
ఇక కర్నూలులో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా కర్నూలులోనే ఓటు హక్కును వినియోగించుకుంటారు. రేపటి నుంచి భారత్ జోడో యాత్ర కర్నూలులోకి ప్రవేశించనుంది. ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకున్న నేతలు రేపు భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు.
Next Story