Sat Dec 21 2024 08:33:16 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. నిన్న రాహుల్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు
రాహుల్ గాంధీ భారత్ జోడో పాతయాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. నిన్న రాహుల్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లడంతో ఆయన ఒకరోజు యాత్రకు విరామాన్ని ప్రకటించారు. నిన్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయంపై సీనియర్ నేతలతోనూ, సోనియా గాంధీతోనూ రాహుల్ చర్చించారు. నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అధ్యక్షుడిగా నేడు నామినేషన్ వేయనున్నారని తెలిసింది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం...
మరో వైపు శశిధరూర్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ తన పాదాయత్రకు నిన్న బ్రేక్ ఇచ్చారు. కేరళలో తిరిగి ఈరోజు యాత్ర ప్రారంభం కానుంది. రోజుకు 25 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ఆగి తిరిగి రాత్రి ఏడు గంటల వరకూ నడక కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ రాహుల్ పాదయాత్ర కేరళలోనే కొనసాగనుంది.
Next Story