Sat Dec 21 2024 03:11:33 GMT+0000 (Coordinated Universal Time)
నాందేడ్ కు భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతుంది. యాత్రలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతుంది. యాత్రలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు. నాందేడ్ జిల్లాలోని కాష్షి చౌక్ నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభమయింది. నాందేడ్ నగరంలో నేడు బహిరంగ సభ ఉంది. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రసంగించనున్నారు.
భారీ బహిరంగ సభ...
రేపు భారత్ జోడో యాత్రలో శివసేన మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉన్నా ఆయన అనారోగ్య కారణాలతో పాల్గొనలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టంబరు 7వ తేదీన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని మహారాష్ట్రాలో కొనసాగుతుంది.
Next Story