Sun Apr 06 2025 08:17:37 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో యాత్ర ముగింపు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. కాశ్మీర్ కు చేరుకున్న యాత్రను నేటితో రాహుల్ ముగించనున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. కాశ్మీర్ కు చేరుకున్న యాత్రను నేటితో రాహుల్ ముగించనున్నారు. రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టంబరు 7వ తేదీన భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర కాశ్మీర్ వరకూ సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లు మీదుగా కాశ్మీర్ కు చేరుకుంది.
ముగింపు సభ...
రేపు కాశ్మీర్ లో జోడో యాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు దాదాపు 23 మంది పార్టీల నేతలను ఆహ్వానించారు. సుదీర్ఘకాలం పాదయాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమయ్యారు. అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. రైతులు, మేధావులతో పాటు వివిధ వర్గాలతో ఆయన సమావేశమై సమస్యలపై చర్చించారు. రాహుల్ గాంధీ యాత్రకు అన్ని రాష్ట్రాల్లో భారీ స్పందన లభించింది. రేపు ముగింపు సభకు ఎవరెవరు హాజరవుతారన్నది చూడాల్సి ఉంది.
Next Story