Thu Apr 10 2025 00:31:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జోడో యాత్ర ముగింపు సభ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ నేడు శ్రీనగర్ లో జరగనుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ నేడు శ్రీనగర్ లో జరగనుంది. జోడో యాత్ర దాదాపు 145 రోజుల పాటు సాగింది. అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ సాగిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ 4,084 కిలోమీటర్ల మేరకకు పాదయాత్ర చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది సెప్టంబరు 7వ తేదీన ప్రారంభమయిన పాదయాత్ర శ్రీనగర్ లో ముగియనుంది. అన్ని రాష్ట్రాలలో ఈ యాత్ర పర్యటించి జమ్మూ కాశ్మీర్ కు చేరుకుంది.
అన్ని పార్టీల నేతలకు...
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. వారితో సమావేశాలు నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ముగింపు సభకు 23 ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్, వైసీపీలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఎవరెవరు ఈ ముగింపు సభకు హాజరవుతారన్నది ఇంకా తెలియకున్నా రాహుల్ యాత్రకు మాత్రం విశేష స్పందన లభించిందని మాత్రం చెప్పొచ్చు.
Next Story