Mon Dec 23 2024 02:26:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాజస్థాన్ లో రాహుల్ పాదయాత్ర
రాజస్థాన్ లో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి స్పందన వస్తుంది.
రాజస్థాన్ లో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు పార్టీ నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఈరోజు రాజస్థాన్ కు సోనియా గాంధీ రానున్నారు. రాహుల్ తో కలసి ఆమె పాదయాత్రలో కొంత దూరం నడవనున్నారు. సెప్టంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమయిన రాహుల్ భారత్ జోడో యాత్ర మూడు నెలల నుంచి కొనసాగుతుంది.
వెంట సోనియా...
నిన్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. నేడు తిరిగి యాత్రను ప్రారంభించనున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల మీదుగా రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగింది. కర్ణాటకలో జరిగిన పాదయాత్రలో సోనియా గాంధీ రాహుల్ వెంట కొంతదూరం నడిచారు. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ లో రాహుల్ వెంట నడవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story