Wed Dec 25 2024 09:25:55 GMT+0000 (Coordinated Universal Time)
84వ రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర
రాహుల్ భారత్ జోడో పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. రాహుల్ పాదయాత్రకు అన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన కనిపిస్తుంది.
రాహుల్ భారత్ జోడో పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. రాహుల్ పాదయాత్రకు అన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన కనిపిస్తుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. సెప్టెంబరు 7వ తేదీన రాహుల్ భారత్ జోడో పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమయింది. మూడు నెలల నుంచి పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
ఏడో రాష్ట్రంలో....
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లలో రాహుల్ పాదయాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. రాహుల్ తన యాత్రలో మేధావులతో పాటు రైతులు వివిధ సంఘాల ప్రజలతో మమేకం అవుతున్నారు. కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతుండటం విశేషం.
Next Story