Thu Dec 26 2024 14:40:05 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో ఈరోజు తెల్లవారు జాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 32 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
పన్ను చెల్లించకుండా....
పలు ప్రయివేటు వ్యాపారసంస్థల్లో ఈ సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా కొందరు వ్యాపారవేత్తలున్నారన్న సమాచారంతో ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడే అవకాశముందని తెలుస్తోంది.
Next Story