Fri Dec 20 2024 15:57:13 GMT+0000 (Coordinated Universal Time)
Railway Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేశాఖలో ఉద్యోగాల జాతర... నోటిఫికేషన్ విడుదల
రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 9 వేల టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయాలని నిర్ణయించింది
రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 9 వేల టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్లలో వివిధ గ్రేడ్లలో ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 9000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయినా గ్రేడ్ 1 సిగ్నల్, 1100, గ్రేడ్ - 3 పోస్టులకు 7,900 అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
ఇవీ ఆర్హతలు...
ఇందుకు అర్హతలను కూడా నోటిఫికేషన్ లో పేర్కొంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టుకు 29,200 రూపాయలు, గ్రేడ్ 3 పోసట్లుకు 19,900 బేసిక పే గా వేతనాన్ని నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Next Story