Fri Nov 22 2024 21:11:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్కూల్స్ కు సెలవు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షం కారణంగా నోయిడా, లక్నో, ఘజియాబాద్, ఆగ్రాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. 1 నుండి 12వ తరగతి వరకు నిర్వహించే అన్ని పాఠశాలలు సోమవారం నాడు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ రాజధాని ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం నుండి భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లపై చాలా నీరు చేరుకుంది. వరదలను తలపిస్తోంది. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా లక్నో, నోయిడా, ఘజియాబాద్, ఆగ్రా, మీరట్, అలీఘర్, మథుర, కాన్పూర్, ఎటా, మెయిన్‌పురి, ఫిరోజాబాద్ జిల్లాల అధికారులు పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
"Due to excessive rain in the district and keeping in view the possibility of excessive rain, the District Magistrate of Gautam Budh Nagar has declared a holiday on October 10 [Monday] in government, semi-government aided, and unaided recognized schools of all the boards operating from class 1 to 12 of the district," అంటూ అధికారులు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
జిల్లాలో భారీగా వర్షం కురిసింది.. మరింత వర్షం కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, గౌతమ్ బుద్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ అక్టోబర్ 10 [సోమవారం] అన్ని ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్కూల్స్ మూసివేయనున్నట్లు నోయిడాలోని పాఠశాల అధికారి ఒకరు పిటిఐకి నివేదించారు. భారత వాతావరణ శాఖ (IMD) పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరింది. పలు రహదారులు జలమయం కావడంతో ముఖ్యంగా ఫ్లై ఓవర్ల కింద వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.
Next Story