Thu Dec 19 2024 18:25:39 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దాయన పదవిని విడిచి పెట్టడట
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మరోసారి ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మరోసారి ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవిని విడిచిపెట్టాలనుకుంటున్నప్పటికీ అది అంటిపెట్టుకునే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లోనూ తననే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనలో ఏదో ఉదని, అందుకే పార్టీ నాయకత్వం కూడా తనకు రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజస్థాన్ కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి.
అధ్యక్షుడిగా చేయాలనుకున్నా...
నిజానికి అశోక్ గెహ్లాత్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేయాలని టెన్ జన్పథ్ భావించింది. కానీ అందుకు ఆయనే అంగీకరించలేదు. తాను రాష్ట్ర రాజకీయాలను విడిచి రానని నిర్మొహమాటంగా చెప్పడంతో అప్పటికప్పడు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసిన విషయాన్ని పెద్దాయన మర్చిపోయినట్లుంది. రాజస్థాస్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అభ్యర్థుల జాబితాలో ఆలస్యం వెనక ఎలాంటి ఇబ్బందులు లేవని, తాను అందరినీ కలుపుకుని వెళుతున్నానని అశోక్ గెహ్లాత్ చెప్పుకొచ్చారు.
Next Story