Fri Dec 20 2024 05:37:30 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సవాలు చేసేందుకు దేశంలో బలమైన
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ పోటీలో ఉండబోరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధే తనతో చెప్పారని గెహ్లాట్ తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ పోటీ చేయనున్నారు. ఒక వీడియోలో, గెహ్లాట్, "నేను (కాంగ్రెస్ అధ్యక్ష పదవికి) పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలో (నామినేషన్ దాఖలు చేయడానికి) తేదీని ఫిక్స్ చేస్తాను" అని చెప్పారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్ 'ఒక వ్యక్తి, ఒకే పదవి' గురించి రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై, నిర్ణయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఉందని అన్నారు. ఇప్పటికే సోనియా గాంధీతో భేటీ అయిన గెహ్లాట్... ఆ తర్వాత కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీరే చేపట్టాలంటూ ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. యావత్తు కాంగ్రెస్ శ్రేణుల ఆకాంక్ష కూడా ఇదేనంటూ ఆయన రాహుల్ కు వివరించారు. గెహ్లాట్ ప్రతిపాదనకు స్పందించిన రాహుల్ గాంధీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తమ కుటుంబానికి చెందిన వారెవ్వరూ ఉండబోరని చెప్పినట్లుగా గెహ్లాట్ తెలిపారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఎంపికవుతారని రాహుల్ చెప్పారని ఆయన వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సవాలు చేసేందుకు దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని ఆయన అన్నారు. కొత్త కాంగ్రెస్ చీఫ్ ఎవరన్నది తనపై ప్రభావం చూపదని, గ్రౌండ్ లెవెల్లో పార్టీ మరింత బలపడుతుందనేది ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 17న జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న ప్రకటించబడతాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 24న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
Next Story