Fri Dec 20 2024 11:51:36 GMT+0000 (Coordinated Universal Time)
పాముకాటుకి బలైన స్నేక్ క్యాచర్.. వీడియో వైరల్
వినోద్ తివారీ(45) అనే వ్యక్తి చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి వెళ్లాడు.
పాముల్ని పట్టడం అతని వృత్తి. అందరూ పాముల్ని చూసి బెదిరిపోతే.. అతను మాత్రం పాముల్ని చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలేస్తాడు. 20 ఏళ్లుగా పాములతో స్నేహం చేస్తున్న అతను.. ఆఖరికి పాముకాటుతోనే కన్నుమూశాడు. ఎంతటి విషపూరితమైన పామునైనా అవలీలగా పట్టి.. స్నేక్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి.. చివరికి నాగుపాముకాటుకి బలయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో చేరుకుంది.
వినోద్ తివారీ(45) అనే వ్యక్తి చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి వెళ్లాడు. దుకాణం బయట పామును పట్టుకుని, దానిని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పాము అతని వేలిపై కాటువేసింది. పాముకాటువేసిన కొద్ది నిమిషాలకే వినోద్ తివారీ మృతి చెందాడు. ఇదంతా అక్కడికి దగ్గర్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో.. దాని కాటుకు కొద్దినిమిషాలకే అతను మరణించాడు.
Next Story