Mon Dec 23 2024 07:12:00 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. ఎలా అయ్యారంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజపుర్ కు చెందిన రాజేంద్ర గుప్త ఒక వజ్రాల మైన్ ను లీజుకు తీసుకున్నారు
అదృష్టం ఎవరిని వరిస్తుందో ఎప్పుడూ చెప్పలేం. అంతా బాగుంటే రాత్రికి రాత్రి పేదరికం మాయమయిపోతుంది. ఇందుకు ఉదాహరణ మధ్యప్రదేశ్ లోని ఒక రైతును చెప్పుకోవాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజపుర్ కు చెందిన రాజేంద్ర గుప్త ఒక వజ్రాల మైన్ ను లీజుకు తీసుకున్నారు. తన స్నేహితులు ఆరుగురితో కలసి వజ్రాల గనిని లీజుకు తీసుకుని వజ్రాల వేట సాగిస్తున్నారు. అయితే వారు లీజుకు తీసుకున్న గనిలో ఖరీదైన వజ్రం లభించింది.
విలువైన వజ్రం...
ఇది 3.21 క్యారెట్ల వజ్రం. దీనిని వెంటనే రైతులు అధికారులకు చూపించగా విలువైన వజ్రంగా గుర్తించారు. దీని విలువ కోట్లలో ఉండవచ్చన్న అంచనా ఉంది. దీంతో వారు నెల రోజుల పాటు పడ్డ శ్రమకు ఫలితం దొరికినట్లయింది. ఈ వజ్రాన్ని విక్రయించి ఏదైనా వ్యాపారాలు చేసుకుంటామని రైతు రాజేంద్ర గుప్త తెలిపారు.
Next Story