Thu Dec 19 2024 12:59:55 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటులోకి ఒంటెపై.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది
రాజస్థాన్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు రాజ్‌కుమార్ రోట్ ఒంటెపై పార్లమెంటుకు వచ్చేందుకు ప్రయత్నించారు
రాజస్థాన్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు రాజ్‌కుమార్ రోట్ ఒంటెపై పార్లమెంటుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన భారతీయ ఆదివాసీ పార్టీ నుంచి ఏకైక ఎంపీగా గెలిచారు. ఒంటెపై పార్లమెంటుకు చేరుకుని పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. అయితే ఒంటెపై పార్లమెంటుకు బయలుదేరిన రాజ్‌కుమార్ రోటీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతో వాగ్వాదం...
తాను ఎంపీనని, పార్లమెంటుకు వెళుతున్నానని, తనను అడ్డగించడమేంటని ఆయన పోలీసులు నిలదీశారు. పార్లమెంటులో ఎలాంటి జంతువులను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. భద్రతాకారణాల దృష్ట్యా అనుమతించబోమని తెలిపారు. దీనిపై తాను సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి ఒంటె పై నుంచి దిగి వెళ్లిపోయారు.
Next Story