Fri Nov 22 2024 23:11:53 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభ మార్చి 14వ తేదీకి వాయిదా
రాజ్యసభ మార్చి 14 వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి
రాజ్యసభ మార్చి 14 వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పార్లమెంటు సమావేశాలను కోవిడ్ కారణంగా రెండు విడతలుగా జరపాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి విడత పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం వంటివి జరిగాయి.
బడ్జెట్ సెషన్ లో....
వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో ఈరోజు సభ్యులు కొంత గందరగోళం జరగడంతో రాజ్యసభను వాయిదా వేశారు. తిరిగి రాజ్యసభ వచ్చే నెల 14 వతేదీన మొదలు కానుంది. ఈరోజు సాయంత్రం లోక్ సభ జరగనుంది. లోక్ సభలో కూడా బిజినెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మార్చి14వ తేదీకి వాయిదా వేయనున్నారు.
Next Story