Mon Dec 23 2024 02:21:26 GMT+0000 (Coordinated Universal Time)
నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఈ రెండు కేసుల విచారణలోనూ మాజీ ఎంపీగా ఉన్న జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు..
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు ఈ వారెంట్ ను జారీ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జయప్రదపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదయ్యాయి. 2019, ఏప్రిల్ 18న రాంపూర్‌లోని కామ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ 2019 ఏప్రిల్ 19న రెండో కేసు నమోదు చేశారు.
ఈ రెండు కేసుల విచారణలోనూ మాజీ ఎంపీగా ఉన్న జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయమై న్యాయవాది అమర్ నాథ్ తివారీ మాట్లాడుతూ.. విచారణ సమయంలో జయప్రద వరుసగా గైర్హాజరు కావడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఈ కారణంగానే ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు మంగళవారం విచారణలో కోర్టు ెలిపిందన్నారు. జయప్రదను కోర్టులో హాజరు పరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసిందన్నారు.
Next Story