Thu Nov 21 2024 22:08:58 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : రామమందిరంలోకి వానరం.. భక్తులంతా తన్మయత్వంతో
అయోధ్య రామాలయంలోకి రాములోరి ప్రవేశం ఈ నెల 22వ తేదీన జరిగింది.
అయోధ్య రామాలయంలోకి రాములోరి ప్రవేశం ఈ నెల 22వ తేదీన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అయితే మరుసటి రోజు నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించారు. దేశం నలుమూల నుంచి అనేక మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్నారు. నిన్న దాదాపు ఐదు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. అయితే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మరుసటి రోజే ఆలయంలోకి వానరం ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది.
గర్భగుడిలోకి...
ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం కాసేపు అక్కడే ఉండింది. వానరం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడంతో భక్తులతో పాటు పూజారులు కూడా అవాక్కయ్యారు. ఆలయంలోని దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించిన వానరాన్ని బయటకు పంపేందుకు భద్రతాసిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారు. కాసేపటి తర్వాత తూర్పు ద్వారం నుంచి వానరం బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని శ్రీరామతీర్ధ ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాములోరి వద్దకు హనుమంతుడు వచ్చాడంటూ భక్తులు సంబరపడిపోయారు.
Next Story