Mon Dec 23 2024 09:36:45 GMT+0000 (Coordinated Universal Time)
బీట్ రూట్ ఫ్రై లో ఎలుక తల.. షాకైన బంధువులు
తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పాతబస్టాండ్ సమీపంలోని బాలాజీ భవన్ వద్ద శాఖాహార రెస్టారెంట్ లో.. మురళి ఓ సంతాప సభకోసం..
ఈ మధ్యకాలంలో హోటళ్లలో ఆర్డర్ చేసిన ఆహారంలో జంతువుల శరీర భాగాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవలే ఓ మెక్ డొనాల్డ్స్ లో వ్యక్తి కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తే.. అందులో కూల్ డ్రింక్ తో పాటు బల్లి కూడా వచ్చింది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పేరుకి అది వెజ్ హోటలే అయినా.. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఎలుక తలను వేసిచ్చారు. ఇంకేముంది విషయం తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ భోజనాన్ని తిన్న తమకి ఏమవుతుందోనని కంగారుపడుతున్నారు.
తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పాతబస్టాండ్ సమీపంలోని బాలాజీ భవన్ వద్ద శాఖాహార రెస్టారెంట్ లో.. మురళి ఓ సంతాప సభకోసం ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతని బంధువు నిన్న చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు మృతుడి చిత్రపటానికి పూజ కార్యక్రమం నిర్వహించి వచ్చిన బంధువులకు భోజనాలు తెప్పించారు. అరణిలోని బాలాజీ భవన్ వెజిటేరియన్ రెస్టారెంట్ నుంచి 35 భోజనాలు తెప్పించారు. బంధువులందరికీ భోజనాలు పెట్టారు. తింటుండగా.. బీట్ రూట్ ఫ్రై లో ఎలుక తల కనిపించింది. దాంతో అందరూ షాకయ్యారు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో.. వారు ఆ రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story