Mon Dec 23 2024 19:17:11 GMT+0000 (Coordinated Universal Time)
Ratan Tata Final Post: రతన్ టాటా ఆఖరి సోషల్ మీడియా పోస్ట్ కన్నీళ్లు పెట్టిస్తోంది!
రతన్ టాటా తన మరణానికి రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు
భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా 86 ఏళ్ళ వయసులో మరణించారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాపార దిగ్గజం మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటనను పంచుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ ఆయన పెట్టిన ఎమోషనల్ నోట్ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. "నా ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఇవన్నీ నిరాధారమైనవని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వయసు సంబంధిత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను" అని తన చివరి నోట్ లో రతన్ టాటా తెలిపారు.
"నా గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు" అని రతన్ టాటా తన మరణానికి రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. నెటిజన్లు ఆయన చివరి సోషల్ మీడియా పోస్టు కామెంట్స్ విభాగంలో పోస్టులు పెడుతున్నారు. రతన్ టాటా అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లో పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్‌ను అక్టోబర్ 30, 2019న పంచుకున్నారు.
Next Story