Fri Nov 22 2024 09:48:53 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యలో దీపోత్సవం.. ఒకే సారి 28 లక్షల దీపాలతో
అయోధ్యలో ఈరోజు 28 లక్షల దీపాలను వెలిగించి రికార్డును సృష్టించనున్నారు.
అయోధ్యలో ఈరోజు 28 లక్షల దీపాలను వెలిగించి రికార్డును సృష్టించనున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళిని ఈ రికార్డుతో ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్ఫయి వేల మంది పాల్గొన్నారు.
గిన్నీస్ బుక్ రికార్డుతో...
ఒకేసారి ఇరవై ఎనిమిది లక్షల దీపాలను వెలిగించడంతో గిన్నీస్ రికార్డును సాధించనున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి దీపోత్సవానికి అయోధ్యలో ఇప్పటికే వేలాది మంది చేరుకున్నారు. కనులారా వీక్షించేందుకు సిద్ధమయ్యారు. అయోధ్యలో రాముల వారి సన్నిధిలో తొలి దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సరయూ నదీ తీరంలో జరిగే తీరంలో జరిగే ఈ దీపోత్సవాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు.
Next Story