Sun Dec 22 2024 23:37:05 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో రెడ్ అలెర్ట్
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసంతృప్త నేత ఏక్నాధ్ షిండే పోస్టర్లకు శివసైనికులు సిరాను పూసి తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు షిండే పై నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలు...
మరోవైపు ఈరోజు శివసేన జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా ఉద్ధవ్ థాక్రే వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొననున్నారు. ఆదిత్యథాక్రే మాత్రం జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శివసేనను తుడిచిపెట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని ఉద్ధవ్ ఆరోపిస్తున్నారు. షిండేకు వ్యతిరేకంగా నిరసనల ప్రదర్శనలు తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story