Sat Mar 15 2025 00:34:10 GMT+0000 (Coordinated Universal Time)
Delhli : ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాగుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేశ్ వర్మ, మంంజిందర్ సిర్సా , పంకజ్ సింగ్, రవీంద్ర ఇంద్రజ్, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు.
ప్రమాణ స్వీకారానికి...
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉఫ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
Next Story