Sun Mar 16 2025 12:04:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ముఖ్య నేతలతో పాటు...
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అత్యంత భారీ బందోబస్తును రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేశారు. ఆహుతులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
Next Story