Sun Dec 22 2024 12:43:45 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : కేరళలో అంతకకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఊహించని విషాదం
కేరళలోని వాయనాడ్ లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కేరళలోని వాయనాడ్ లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 272 మందికి పైగా మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో గ్రామాలకు గ్రామాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో వంతెనను ఆర్మీ అధికారులు నిర్మిస్తున్నారు. వంతెన పూర్తయితే సహాయక చర్యలు మరింత ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
తొమ్మిది జిల్లాలకు...
కేరళలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముందక్కై, చురాల్మలాల్ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందని చెబుతున్నారు. శిధిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతదేహాలు ఎవరెవన్నవన్నీ గుర్తుపట్టకుండా ఉంది. వందల సంఖ్యలో గల్లంతయ్యారని చెబుతున్నారు. ప్రధానంగా టీ తోటల్లో పనిచేసే కార్మికులే ఎక్కువ మంది మరణించారని తెలిసింది.
గ్రామాలన్నీ బురదలో...
గ్రామాలన్నీ బురదలో కూరుకుపోయాయి. ఇళ్లన్నీ బురదతో నిండిపోవడంతో వాటిని కనుక్కోవడం కూడా కష్ట సాధ్యంగా మారింది. నిన్నటి వరకూ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. గత మూడు రోజుల నుంచి బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీయడం కూడా ఆర్మీకి కష్టంగా మారింది. ఇక భారీ ఆస్తి నష్టం సంభవించింది. శిధిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు బతికి బయటపడటం కష్టమేనని అన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంకు చెందిన వారు ఎక్కువగా గల్లంతయ్యారని అంటున్నారు.
Next Story