Mon Dec 23 2024 01:27:31 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో నాలుగు BF-7 కేసులు
పశ్చిమ బెంగాల్ లో నాలుగు బీఎఫ్ - 7 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ కూడా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో నాలుగు బీఎఫ్ - 7 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. పాజిటివ్ వచ్చిన నలుగురు ప్రయాణికులు అమెరికా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారికి పరీక్షలు చేయగా బీఎఫ్ 7 వేరియంట్ గా తేలింది.
వేగంగా విస్తరించే...
వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గత వారం కూడా కోల్కత్తా విమానాశ్రయంలో జరిపిన పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్ లోకి ఈ వేరియంట్ ఇది వరకే ప్రవేశించింది. అత్యంత వేగంగా విస్తరించే వేరియంట్ కావడంతో అధికారులు అప్రమత్తమై వారిన ివెంటనే క్వారంటైన్ కు తరలించి వైద్యచికిత్సను అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story