గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఎందుకు.. రాజ్యాంగంకు ఎంత సమయం పట్టింది?
India Republic Day: ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి పొందిన తర్వాత మనకు స్వాతంత్ర్యం
India Republic Day: ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి పొందిన తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్దించింది. అయితే అప్పట్లో రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ కీలక బాధ్యతలు చేపట్టారు.
అయితే రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ అంటే తాత్కాలిక పార్లమెంట్‌కు సమర్పించగా, దాదాపు రెండు సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు కీలక చర్చలు నిర్వహించి, ఎన్నో సవరణలు చేసిన తర్వాత భారత రాజ్యాంగ రూపుదిద్దుకుంది. ఈ రాజ్యాంగాన్ని అప్పట్లో ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి రూపుదిద్దుకుంది. అలా రూపుదిద్దుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే భారత గణతంత్ర. అందుకే 1950 జనవరి 26న ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది. అందుకే జనవరి 26 చారిత్రాత్మకంగా రోజుగా ప్రాముఖ్యత లభించింది. భారత స్వాతంత్ర్యం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.
భారత రాజ్యాంగ నిర్మాణానికి ఎంత కాలం పట్టింది?
☛ 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది.
☛ ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
☛ రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి.
☛ వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
రాజ్యాంగం ఎప్పుడు ఆమోదం పొందింది?
భారత రాజ్యాంగం1949 నవంబర్ 26న సభలో ఆమోదం పొందింది. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. ఇక చివరగా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి. హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు. వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయం ఏది?
మన భారత రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు. అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేచ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు అన్నట్లు. ఇలా ఎన్నో సమావేశాలు, చర్చలు, పోరాటాల తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.