Mon Dec 23 2024 17:16:57 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నోటు కన్పించకపోవడానికి కారణమిదేనా?
రెండు వేల రూపాయల నోట్లను బ్యాన్ చేయడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది
గత కొద్ది రోజుల నుంచి రెండు వేల రూపాయల నోటు కన్పించడం లేదు. ఏటీఎంల నుంచి కూడా ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తున్నాయి కాని, రెండు వేల నోట్లు రావడం లేదు. దీంతో రెండువేల నోట్లను ప్రభుత్వం నిషేధిస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రెండు వేల నోట్లు స్థానంలో కొత్తగా రిజర్వ్ బ్యాంకు వెయ్యి నోటును తెస్తుందంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
అంతా అబద్ధం...
అయితే రెండు వేల రూపాయల నోట్లను బ్యాన్ చేయడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. కొత్త ఏడాది నుంచి రెండు వేల నోటుపై నిషేధం అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆర్బీఐ చెప్పింది. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, వీడియోలు వస్తున్నాయని వాటిని నమ్మి ఎవరికీ షేర్ చేయవద్దని ఆర్బీఐ పేర్కొంది. రెండు వేల నోట్లు ఇటీవల కాలంలో ఏటీఎంలలో కన్పించకపోవడంతో అనుమానాలు రేకెత్తించేలా పోస్టింగ్ లు వస్తుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Next Story