Mon Dec 23 2024 16:23:47 GMT+0000 (Coordinated Universal Time)
మరో విడత రేట్ల పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.
జీడీపీ వృద్ధిరేటు...
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును కూడా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పెంచింది. ద్రవ్యోల్బణం లక్ష్యం 6.7 శాతంగా కొనసాగింపు ఉంటుందని తెలియవచ్చింది. జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 6.8 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ అక్టోబరు నెలలోనూ బలపడినట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
Next Story