Mon Dec 23 2024 16:33:53 GMT+0000 (Coordinated Universal Time)
రెపోరేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్
రెపో రేటును పెంచుతూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు
రెపో రేటును పెంచుతూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు. రెపో రేటు పెరగడంతో వడ్డీల భారం మరింత పెరగనుంది. అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరసగా ఆరోసారి రెపో రేటును పెంచడంతో ఇండియా రెపోరేటును పావు శాతం పెంచింది. వడ్డీల భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆరోసారి రెపో రేటును...
ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచింది. 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేట్లు దీంతో 6.50 శాతానికి చేరింది. మూడేళ్ల నుంచి కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వరసగా రెపోరేట్లను పెంచుకుంటూ వెళుతున్నారు. డిసెంబరు మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లను పెంచింది. గత ఏడాది మే నెల నుంచి ద్రవ్యోల్బాణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ రుణ రేటును 225 బేసిస్ పాయింట్లను పెంచింది.
Next Story