Mon Dec 23 2024 17:19:10 GMT+0000 (Coordinated Universal Time)
రుణాలు మరింత భారం.. పెరగనున్న ఈఎంఐలు
వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత పెంచింది. వరసగా ఏడాదిలో నాలుగోసారి వడ్డీరేట్లను పెంచింది
వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత పెంచింది. వరసగా ఏడాదిలో నాలుగోసారి వడ్డీరేట్లను పెంచింది. ఇక వాహనాలు, గృహాల రుణం వడ్డీ భారం అధికమవుతుంది. మే నెల నుంచి ఇప్పటి దాకా 140 బేస్ పాయింట్లను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం 0.50 శాతం పెంచడంతో నాలుగు నెలల వ్యవధిలో రెపోరేటు రుణాలపై ఆర్బిఐ వసూలు చేసే వడ్డీ రేటు 1.90 శాతానికి పెరిగినట్లయింది. ద్రవ్యపరపతి విధానం కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
రెపోరేటు పెంచి ఆర్బీఐ...
దీంతో గృహరుణాలు తీసుకునే వారికి మరింత భారం కానుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది. రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. వాహనాలు, గృహాలకు కట్టాల్సిన ఈఎంఐ కూడా పెరుగుతుంది. వాటికి చెల్లించాల్సిన కాలం కూడా పెరిగే అవకాశముంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఈ పెరిగిన రేట్లతో ఇబ్బంది అని అంటున్నారు ఆర్థిక నిపుణులు.
Next Story