Mon Dec 23 2024 06:20:13 GMT+0000 (Coordinated Universal Time)
Banks : రేపు బ్యాంకులు పనిచేస్తాయి.. ఆదివారమైనా
రేపు ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. 31వ తేదీ ఆదివారం రావడంతో బ్యాంకులు ఆరోజు పనిచేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అన్ని రోజుల మాదిరిగానే...
ముప్పయి మూడు బ్యాంకులకు ఆర్బిఐ ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయని తెలిపింది. నెఫ్ట్, ఆర్టిజిఎస్తోపాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది.
Next Story