Sat Nov 23 2024 03:14:48 GMT+0000 (Coordinated Universal Time)
లాలూయే దోషి.. శిక్ష మాత్రం?
బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ను పశుదాణా కుంభకోణం కేసు వదిలిపెట్టడం లేదు.
బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ను పశుదాణా కుంభకోణం కేసు వదిలిపెట్టడం లేదు. రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. శిక్షా కాలం ఎంత అనేది ఈ నెల 18వ తేదీన కోర్టు ఖరారు చేయనుంది. ఈ కేసులో లాలూ దాదాపు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. 950 కోట్ల కుంభకోణం జరిగిందని సీబీఐ ఆరోపించింది.
1996లో ...
1996లో పశు దాణా కుంభకోణం కేసు వెలుగు చూసింది. 1997లో సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది. లాలూతో పాటు 99 మంది సహ నిందితులుగా చేర్చారు. ఈ కుంభకోణంపై సుదీర్ఘకాలం విచారించిన కోర్టు 25 ఏళ్ల తర్వాత దోషిగా తేల్చింది. ఈ కుంభకోణంలో మొత్తం ఐదు కేసులుండగా, ఐదింటిలో లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉండటం విశేషం. అయితే శిక్ష ఎంతపడుతుందన్నది మరో మూడు రోజుల్లో తేలనుంది.
Next Story