Sun Dec 22 2024 11:29:34 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
చెన్నై - బెంగళూరు హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును కంటైనర్ ను ఢీకొట్టింది.
చెన్నై - బెంగళూరు హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. శ్రీపెరంబదూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
రోడ్డు క్రాస్ చేస్తుండగా...
ప్రయివేటు బస్సు రోడ్డును క్రాస్ చేస్తుండగా కంటైనర్ అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. బస్సు బోల్తా పడటంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Next Story