Sun Dec 22 2024 19:25:10 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : రోళ్లు పగులుతాయోమో తెలియదు కానీ.. పిట్టల్లా రాలిపోతున్నారు.. యాత్రలు వాయిదా వేసుకోండి
రోహిణి కార్తె లో ఎండల ప్రభావం చూపుతుంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రోహిణి కార్తె లో ఎండల ప్రభావం చూపుతుంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడు భగభగలకు ఇబ్బంది పడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల రాక కొంత ముందరగా వస్తుందన్న వార్త కంటే ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. అనేక నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
యాభై డిగ్రీలు...
యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు వేడి గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు బలయిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడి సెగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న తెలంగాణలో ఒక్కరోజే ఎనిమిది మంది మరణించారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
అర్బన్ ప్రాంతాల్లో...
అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారడానికి కారణమని అంటున్నారు. దీంతో పాటు ఎల్నినో ప్రభావం కూడా కారణమని చెబుతున్నారు. అందుకే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తుండటంతో కొందరికి వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story