కేవలం 14 రోజులు మాత్రమే పని చేస్తుందా?
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్.. దాదాపు 41 రోజుల ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్.. దాదాపు 41 రోజుల ప్రయాణం అనంతరం చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. ల్యాండింగ్ కు ఇబ్బందులు ఏవీ తలెత్తకుండా ఉంటే మాత్రం.. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం సరిగ్గా 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద కాలుమోపుతుంది. ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయితే ల్యాండర్ లోపలి నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికొస్తుంది. సైడ్ ప్యానళ్లను ర్యాంప్‌గా ఉపయోగించుకుంటూ 14 రోజుల పాటు వివిధ రకాల అధ్యయనాలు చేస్తుంది. రసాయనిక విశ్లేషణలు కూడా చేపడుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా విక్రమ్, ప్రగ్యాన్‌ల జీవితకాలం 14 రోజులే అని కూడా గుర్తించాలి. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే వాటిలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక పని చేయడం కుదరకపోవచ్చు. ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. మళ్లీ సూర్యోదయం అయ్యేదాకా విక్రమ్, ప్రగ్యాన్ పని చేస్తే.. మరో 14 రోజులు పనిచేసే అవకాశముంటుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా చంద్రయాన్-3 విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ల్యాండింగ్ ప్రక్రియ సాఫీగా సాగాలని దేశ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు.