Mon Dec 23 2024 16:35:51 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప దర్శనానికి అన్ని గంటలా!!
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోడానికి భక్తులు చాలా కష్టాలు
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోడానికి భక్తులు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి భారీగా అయ్యప్ప మాలలు ధరించారు భక్తులు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతూ ఉండడం.. కేరళ ప్రభుత్వం నిర్వహణకు సంబంధించి అన్ని విషయాలలోనూ చేతులు ఎత్తేయడంతో అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఏకంగా లాఠీఛార్జ్ చేస్తున్నారు.
అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కిక్కిరిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులకు కనీస సరైన సౌకర్యాలు కూడా లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రావెన్స్ కోర్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని.. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 2 కిలో మీటర్లకు పైగా క్యూలో అయ్యప్ప భక్తులు నిల్చున్నారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story