Sun Dec 14 2025 04:06:38 GMT+0000 (Coordinated Universal Time)
పంబ వరకూ క్యూ లైన్
శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు.

శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రకాల భద్రత ఏర్పాట్లను చేసింది. మండలపూజ కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శబరిమల భక్తులతో కిక్కిరిసి పోయింది.
లక్షల సంఖ్యలో భక్తులు...
పంబ నుంచి క్యూ లైన్ కొనసాగుతుంది. అయ్యప్ప దర్శనం కావాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. క్యూలైన్ లో కొండ పైకి చేరుకోవాలంటే భక్తులు అవస్థలు పడుతున్నారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల మార్మోగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- Tags
- rush
- sabarimala
Next Story

