Sun Dec 22 2024 12:36:35 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
ఉత్తర్ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టలు తప్పింది. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది.
ఉత్తర్ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టలు తప్పింది. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బండరాయి ఢీకొట్టడంతో...
ఈరోజు తెల్లవారు జామున సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటనకు గల కారణాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. సబర్మతి రైలులో ఉన్న ప్రయాణికులను బస్సులను సమీపంలోని వారు చేరాల్సిన ప్రాంతాలకు తరలించేలా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.
Next Story