Sat Dec 21 2024 02:29:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వార్తలు అవాస్తవం .. విధుల్లోకి రెజ్లర్లు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధించినట్లు రెజ్లర్లు ఆరోపించారు. ఆయన్ను తక్షణమే అరెస్టు చేయాలని సాక్షీ..
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న స్టార్ రెజ్లర్లు మళ్లీ విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖకు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షీ మాలిక్, పూనియా మళ్లీ చేరారు. తమను లైంగికంగా వేధించాడని బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు చేస్తూ శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహిళా రెజ్లర్లు భేటీ అయిన విషయం తెలిసిందే. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధించినట్లు రెజ్లర్లు ఆరోపించారు. ఆయన్ను తక్షణమే అరెస్టు చేయాలని సాక్షీ మాలిక్‌తో పాటు పలువురు రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తమ మొరను ఆలకించకపోవడంతో.. రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో రైతు నేత టికాయత్ జోక్యం చేసుకోగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. అంతకుముందు రెజ్లర్లను జంతర్ మంతర్ నుంచి గెంటేశారు.
తాజాగా రెజ్లర్లు తమ ఆందోళనను విమరమించినట్లు వార్తలు రాగా.. ఆ వార్తల్ని సాక్షిమాలిక్ కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు ప్రసారం అవుతున్నట్లు ఆమె తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అని సాక్షీ మాలిక్ ట్విట్టర్ వేదికా వెల్లడించారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నానని, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
Next Story